SKLM: వెలుగు విఓఏలకు 3 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని లేకుంటే ఆందోళన చేపడుతామని CITU జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా వెలుగు DRDA పీడీ కిరణ్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వెలుగు విఓఏలకు కనీస వేతనాలు ఇవ్వాలని, అలాగే హెచ్ఎర్ పాలసీ అమలు చేయాలని కోరారు.