AP: రాజధాని అమరావతిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగు ప్రజల దశాబ్దాల ఆకాంక్షలు నెరవేరే చరిత్రాత్మక రోజు ఇది. పార్లమెంట్ వేదికగా, ప్రధాని మోదీ ఆశీస్సులతో అధికారికంగా ఆమోదం పొందనుంది. జగన్ రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడి ప్రజలను వంచించారు. జగన్ హయాంలో జరిగిన దుర్మార్గాలకు బలికాకుండా కూటమి ప్రభుత్వం రక్షించింది’ అని పేర్కొన్నారు.