NZB: విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు గురువారం బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో పదో తరగతి పరీక్షకేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలోని ఆయా తరగతి గదులను సందర్శించి పరీక్షల నిర్వహణ సరళిని కలెక్టర్ పరిశీలించారు. తరగతి గదిలో తగిన వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.