ASF: కాగజ్ నగర్ పట్టణం వార్డు నం.1లో గురువారం నిర్వహించిన వార్డు సభలో MLA హరీష్ బాబు పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా రెండు లక్షల పెన్షన్లు రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేయనున్నదని తెలిపారు. గతంలో వార్డు లో 18 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. UIDF నిధులతో వార్డులో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపడుతామన్నారు.