KNR: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట18వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు, ప్రజలు పాల్గొని డ్రైనేజీ, సీసీ రోడ్లు, పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఈ సభలు కీలకమని కౌన్సిలర్ కుతాటి తిరుపతి పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.