NLG: చిట్యాలలో నిర్వహించిన ‘ప్రగతి ప్రణాళిక’ సభలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, 30 పడకల ఆసుపత్రి, బతుకమ్మ కుంట నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ పాల్గొన్నారు.