TG: వికసిత్ భారత్ సాకారం కోసం వికసిత్ ఆంధ్ర నిర్మాణం అవసరమని ఎంపీ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. రాజధాని కోసం 29 వేలమంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. భవ్య రాజధాని సాకారం కోసం ఏపీ ప్రజలు కలలు కన్నారని తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం తీసుకున్నారని వెల్లడించారు.