KMM: కల్లూరు మున్సిపాలిటీలో గురువారం వార్డు సభలు నిర్వహిస్తున్న సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి ప్రజలకు పలు సూచనలు ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తయిందని ఈ కాలంలో అనేక అభివృద్ధి పథకాలు ప్రజల కోసం ప్రవేశపెట్టామని తెలిపారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారని వెల్లడించారు.