అన్నమయ్య: మదనపల్లెలో పెళ్లై ఐదు నెలలు కూడా గడవకముందే హరిత (22) అనే యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గురువారం పట్టణంలోని బసినికొండలో నివసిస్తున్న వినోద్ భార్య హరిత, భర్తతో జరిగిన తగువుల కారణంగా ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోందన్నారు.