MNCL: మహానీయుల జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని బెల్లంపల్లి పట్టణ దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కమిషనర్ సంపత్‌ను కలిసి మహానీయుల జయంతి ఉత్సవాల గూర్చి చర్చించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మాదిరి పట్టణంలో కూడ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలు వహించాలని కోరగా, మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నారు.