ADB: అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ఆయన విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 18వ శతాబ్దంలోనే నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహా సామాజిక విప్లవకారుడని రాజేశ్వర్ కొనియాడారు.