NZB: ప్రతి యువకుడు హనుమంతుడిలా మారాలని, నిజాయితీగా ఉంటూ ధర్మాన్ని నిలబెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం సారంగాపూర్, నీరుగొండ హనుమాన్ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ పవిత్రమైన రోజు మనమందరం ఒక సంకల్పం చేయాలని, సమాజ సేవలో ముందుండాలన్నారు.