NLR: కందుకూరు, పొన్నలూరు రహదారిలో ముత్తరాసిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కందుకూరు వైపు వస్తున్న బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో, దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.