KMM: నకిలీ బంగారాన్ని అసలుదిగా నమ్మించి బ్యాంకుకు కన్నం వేయాలని చూసిన కిలాడీ గ్యాంగ్ గుట్టు రట్టయింది. ఈ ఘటన ఏన్కూర్‌లో జరిగింది. నిందితులు శ్రీపాది సతీష్, మౌనిక, జయమ్మ, నరేష్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సంధ్య తెలిపారు. నకిలీ నగలతో రుణం పొందేందుకు ప్రయత్నించగా అధికారుల తనిఖీల్లో మోసం వెలుగుచూసింది.