NRML: మామడ మండల కేంద్రంలో గురువారం ఉచిత గాలికుంట వ్యాధి నివారణటీకల కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్, వెటర్నరీ వైద్యులు పాల్గొని గ్రామంలోని ఆయా రైతుల పశువులకు టీకాలు వేశారు. ప్రతి ఒక్కరూ తమ పశువులకు వ్యాధులు రాకుండా నివారణ టీకాలు వేయించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.