KMM: గోదావరి నదిలో మునిగిపోతున్న పలువురి ప్రాణాలను కాపాడిన గజ ఈతగాడు కరుకు ప్రసాద్‌ను ఎస్పీ రోహిత్ రాజ్ ఘనంగా సత్కరించారు. ఇటీవలే ప్రసాద్‌కు రవీంద్రభారతిలో సాహస రత్న తిరుపతిలో నేషనల్ అవార్డు లభించిన నేపథ్యంలో ఎస్పీ తన కార్యాలయంలో ఆయనను కుటుంబ సమేతంగా గౌరవించారు. ప్రాణ రక్షణలో ప్రసాద్ చూపుతున్న ధైర్యసాహసాలను ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.