ADB: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నేడు అధికారికంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న పాపన్న విగ్రహం వద్ద ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ వర్ధంతి ఉత్సవానికి గౌడ సంఘం నాయకులు, బీసీ కులాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.