MLG: వేసవి దృష్ట్యా రేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే, జూన్ 3నెలల బియ్యం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెలలో పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి పైసల్ హుస్సేన్ తెలిపారు. లబ్ధిదారుడికి నెలకు 6కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నారు. జిల్లాలో సుమారు 5,490 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీకి సిద్ధం చేశారు. లబ్ధిదారులు మూడు సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుందన్నారు.