వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో 50 అడుగుల ఎత్తైన భారీ ఆంజనేయ స్వామి విగ్రహం కొలువై ఉంది. హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త తన కోరిక నెరవేరినందుకు కృతజ్ఞతగా ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులు హకీంపేట, దాదాపూర్ మీదుగా పోలేపల్లి గ్రామానికి చేరుకోవచ్చు.