NLG: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్గొండ 22వ డివిజన్ కార్పోరేటర్ పర్వీన్ సమద్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 22వ డివిజన్లోని రెహమత్ నగర్ అంగన్వాడీ పాఠశాలలో మిషన్ వాత్సల్య పథకంలో బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.