SRPT: జిల్లా మునగాల మండలంలోని 22 గ్రామాల్లో నేడు నిర్వహించనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం కింద గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతను పెంచడంతో పాటు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో గ్రామ సభలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.