ADB: జనగణన–2027 సన్నాహకాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధి, ప్రణాళికలకు పునాది వంటిదని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. ప్రతి దశను కచ్చితంగా, సమయపాలనతో పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.