JGL: మెట్పల్లి మండలం వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయానికి రూ. 54,273 ఆదాయం వచ్చినట్లు ఈవో కాంతరెడ్డి తెలిపారు. వివిధ సేవ టికెట్స్ ద్వారా రూ. 43,076, అమ్మవారి హుండీల ద్వారా రూ. 11,197 కలిపి మొత్తం రూ. 54,273 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయ డివిజన్ పరిశీలకులు రాజ మొగిలి, సిబ్బంది కల్వకుంట్ల అనిల్ రావు పాల్గొన్నారు.