NZB: పట్టణంలోని వినాయక్ నగర్లో 8 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళ చేతిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. బద్ధ సౌందర్య అనే మహిళతో మేస్త్రి పని చేసే జక్కులోళ్ల మోహన్(40) సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఇవాళ సౌందర్య తన చీరతో మోహన్ మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చిందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.