మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 7వ వార్డ్‌లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను మున్సిపల్ ఛైర్మెన్ దావ స్వాతి-రమేష్ బాబు ఆదివారం పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, నాణ్యత పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. పట్టణ ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.