VKB: వేసవి సెలవుల్లో చెరువుకుంటల్లోకి ఈతకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలతో వెళ్లాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా యువకులకు చిన్నారులకు సూచించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చెరువులోకి ఈతకు వెళ్తే లోతు తెలియక చెరువుల్లో పడి మరణిస్తున్నారు. ఈతకు వెళ్లి మరణిస్తున్న యువకుల నిండు నూరేళ్ల జీవితము ముగిసిపోతుందని వారి కుటుంబానికి నష్టం జరుగుతుందని సూచించారు.