BHNG: రైతులకు యూరియా నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్ మాట్లాడుతూ.. యాప్లో యూరియా బుక్ చేసుకుందామనుకుని ఓపెన్ చేసే క్రమంలో సెకండ్లలో యూరియా ఖాళీ అయిపోతుందన్నారు. దీంతో రైతులకు యూరియా లభించడం లేదన్నారు.