NRML: దిలావర్పూర్ మండలంలో సోమవారం కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షానికి పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితికి వచ్చారు. మరి కొన్ని రోజులలో పంట చేతికొస్తుంది అన్న సమయంలోనే ఇలా గాలివాన రావడంతో రూ. లక్షల పంట నష్టం సంభవించింది. ఈ మేరకు ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.