BHPL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై MLA గండ్ర సత్యనారాయణ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా MLA, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆసుపత్రిని సందర్శించి పలు విభాగాలను సమగ్రంగా పరిశీలించారు. ఆసుపత్రి వార్డులు, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, సిబ్బంది నిర్లక్ష్యం, సమయపాలన లోపాలపై MLA తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.