JGL: పెగడపల్లి రైతుభరోసా, ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎరువుల బుకింగ్ యాప్‌లలో రైతులు ఒకే మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని ఏఓ శ్రీకాంత్ తెలిపారు. వేర్వేరు నంబర్లు ఉంటే ఎరువుల కొనుగోలులో సాంకేతిక ఇబ్బందులు వస్తాయన్నారు. ఈనెల 20వ తేదీలోగా నంబర్లను అప్డేట్ చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. నిర్దేశిత గడువులోగా రైతులు ఈ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.