MHBD: ఇనుగుర్తి (M) చిన్నముప్పారంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని శనివారం రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. 2250 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు నెల రోజులుగా కళ్లంలో పంట నిల్వ చేసి ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని ఇతర మండలాల్లో 2-3 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఇనుగుర్తిలో ఒక్కటి కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు.