జగిత్యాలలో ఈనెల 20న జరగనున్న బీఆర్ఎస్ సభపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావును రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు. అది బీఆర్ఎస్ బహిరంగ సభనా, జీవన్‌రెడ్డి చేరిక సభనా ప్రకటించాలని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు తగవని హెచ్చరించారు. సభకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించినట్లు తెలిపారు.