AKP: అనకాపల్లి గవరపాలెంలో ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో వంటలు వండి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు.