ఉప్పల్ వేదికగా SRHతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ఇలాంటి పిచ్‌పై 195 పరుగుల లక్ష్యం సాధ్యమేనని తెలిపాడు. ’10 ఓవర్ల తర్వాత 80 పరుగులు మాత్రమే అవసరం. ఒక్క భాగస్వామ్యం నెలకొల్పగలిగినా మ్యాచ్ మాదే. 11-13 ఓవర్లలో కేవలం 9 పరుగులే రావడం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. డెత్ ఓవర్లలో ఛేజ్ చేయడం కష్టంగా మారింది’ అని చెప్పుకొచ్చాడు.