VKB: కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని గోఖ ఫసల్బాద్ శివారు అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ వాదంకుంట ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం టెంకాయల విక్రయానికి వేలం పాట జరిగింది. సర్పంచ్ మల్లమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన పకీరప్ప రూ.26,500 దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రప్ప, వార్డ్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.