ASR: హుకుంపేట మండలం రాప పంచాయతి లివిటీ, ఈదులగరువు గ్రామాల్లో వంగిపోయిన విద్యుత్ స్తంభాలు గిరిజనులకు భయాందోళన కలిగిస్తున్నాయి. కొన్ని ఇనుప స్తంభాలు ప్రమాదకర స్థితిలో ఉండటంతో ఎప్పుడు కూలి ఇళ్లపై పడుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఈ సమస్యపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని వాపోయారు.