BHPL: జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కరుణాకర్ కోరారు. భూపాలపల్లిలో మీడియాతో వారు మాట్లాడుతూ… సీఎం పర్యటనకు ప్రజలు అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు.