NLG: దేవరకొండ కోర్టును అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్, జిల్లా పోక్సో కోర్ట్ ప్రత్యేక న్యాయమూర్తి కులకర్ణి విశ్వనాథ్ దిలీప్ రావు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. న్యాయవాదులు కోర్టు పరిధిలోని కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలన్నారు.