NRPT: మక్తల్ పట్టణ అభివృద్ధిలో భాగంగా విద్యుత్ మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం విద్యుత్ శాఖ అధికారులను కలిసి టీచర్స్ కాలనీ, వినాయకనగర్, శ్రీనివాస, అంజనాద్రి కాలనీల సమస్యలు వివరించారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ వైర్ల మార్పిడి చేపట్టాలని కోరారు.