HNK: సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కలిశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కాసేపు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.