ATP: గుంతకల్లు రైల్వే డివిజన్లో యశ్వంతపూర్- కాచిగూడ, మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సమయ వేళలను ఈనెల 15వ తేదీ నుంచి మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. యశ్వంత పూర్- కాచిగూడ మధ్య నడిచే రైలు మధ్యాహ్నం 3.45 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.