BDK: ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హర్షవర్ధన్ ఉత్తమ మెడికల్ సూపరింటెండెంట్ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేసి అభినందించారు. ఆసుపత్రి బృందం సమష్టి కృషితోనే ఈ గుర్తింపు లభించిందని ఆయన అన్నారు