VKB: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని చౌడాపూర్ ఎస్సై రమేశ్ కుమార్ సూచించారు. మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.