NZB: మోస్రా మండల కేంద్రంలో మంగళవారం రాత్రి వీధి కుక్క దాడి చేయడంతో ఓ వ్యక్తి కాలికి తీవ్ర గాయమైంది. రాత్రి వేళల్లో కుక్కల సంచారం పెరగడంతో పాదచారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కుక్కలు అడ్డు రావడంతో ద్విచక్ర వాహనాలపై నుంచి పడి పలువురు గాయపడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను అరికట్టాలని కోరారు.