HNK: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. పెద్ద అంబర్ పేట్–బొంగులూరు మార్గంలో హన్మకొండకు చెందిన వేద ప్రకాశ్ రెడ్డి కారు అదుపుతప్పి నీటి ట్యాంకర్ను ఢీకొట్టింది. ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన రెండున్నరేళ్ల కుమారుడు అర్జున్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.