AP: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన దేవదాయశాఖ అధికారి శాంతిని ఏసీబీ అధికారులు ఇవాళ, రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇటీవల ఆమె నివాసం, బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఆమెను సస్పెండ్ చేసింది. కస్టడీలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.