KMM: జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు కల్లూరు మండలం నారాయణపురం చేరుకుని సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కల్లూరులో CHC, పెనుబల్లి మండలం పులిగుండాల వద్ద ఎకో-టూరిజం ప్రాజెక్టును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం సత్తుపల్లిలో ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.