SRD: డీలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గాల విభజన ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఇతర దక్షిణ రాష్ట్రాలు కూడా నష్టపోతాయని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే విధంగా కుట్ర జరుగుతోందన్నరు.