KMR: జుక్కల్లోని మార్కెండేయ మందిరం వద్ద మంగళవారం రాత్రి దారుణం జరిగింది. స్థానిక వాసి గోపాల్ తన భార్యను వేధిస్తుండగా, ఆమె భయంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్యను వెతుకుతూ వెళ్లిన గోపాల్, అదే గ్రామానికి చెందిన మోతే దత్తు (63)పై అనవసర గొడవకు దిగి గొడ్డలితో తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావమైన దత్తును 108లో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.