నాగశౌర్య, విధి జంటగా నటించిన ‘బ్యాడ్‌బాయ్ కార్తీక్’ ఈనెల 17న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో HYDలో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో నాగశౌర్య మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనను సరికొత్తగా చూస్తారని, ఇది అందరికీ నచ్చే చిత్రమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రభాస్ తొలి హీరోయిన్ శ్రీదేవితో నటించడం అదృష్టమని, తనకూ ఆ లక్ కలిసి రావాలని శౌర్య కోరుకున్నాడు.